ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీఎం వివరించారు. అనంతరం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్తలను కలెక్టర్ వివరించారు.