TG: నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీలను బంద్ చేయాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1లోపు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఛైర్మన్ రమేష్ బాబు తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో తరహాలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.