VKB: పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టంపల్లి గేటు నుంచి కంకల్-లాల్ పహాడ్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిని దయనీయంగా మారింది. రోడ్డు పనులు పూర్తి కాకపోవడం, కంకల్ వద్ద బీర్ ఫ్యాక్టరీ సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురి వాహనాల విడిభాగాలు దెబ్బతిన్నాయని బీజేపీ నాయకులు రవీందర్ తెలిపారు.