SKLM: మొంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస ఎమ్మార్వో రాంబాబు అన్నారు. మండలంలోని నదీ పరి వాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, గాలి వానల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6309679505 టోల్‌ఫ్రీ నంబర్‌కి సంప్రదించాలని సూచించారు.