SDPT: బాలవికాస సంస్థ అనుబంధమైన జాన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని బాలవికాస ఆఫీసులో అనాధ వృద్ధుల ఆదరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస మహిళా కో-ఆర్డినేటర్ అన్న మేరీ సుజాత పాల్గొన్నారు.