TPT: తిరుపతి రూరల్ పరిధిలోని దుర్గ సముద్రం గ్రామం వద్ద గల స్వర్ణముఖి నదిని ఆదివారం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నదిపై చెక్ డ్యాం ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన చెక్ డ్యాం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.