W.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. ఆయన ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని నియోజకవర్గంలోని ప్రతి శాఖధికారులు తమ తమ పరిధిలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.