VZM: కొత్తవలస తాసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దయినట్లు ఎల్కోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో పొంచి ఉన్న భారీ వర్షాలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.