VZM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, పైవేటు పాఠశాలలకు రేపటి నుంచి 29 వరకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం DEO మాణిక్యం నాయుడు మాట్లాడుతూ.. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు అన్ని పాఠశాలలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. HM లు, MEO లు విద్యార్థులకు సమచారమందించాలన్నారు.