BHPL: మొంథా తుఫాను కారణంగా BHPL జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో వర్షం మొదలైంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట ఏరే దశలో ఈ వర్షాలతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు.