సత్యసాయి: కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులకు సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. అమరవీరుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉన్నామని, వారి త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడం మన బాధ్యతని ఎస్పీ తెలిపారు.