GNTR: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన గాలులకు పెదకాకాని మండలం నంబూరులో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.హోర్డింగ్ ఫ్లెక్సీలు విద్యుత్ తీగలకు చుట్టుకోవడమే ఈ అంతరాయానికి కారణం. ఏఈ బ్రహ్మయ్య బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వినియోగదారులు సహకరించాలని కోరారు.