ADB: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. పోచర గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించినందుకుగాను గ్రామస్తులు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని గజేందర్ ప్రజలను కోరారు.