JN: మొంథా తుఫాను తీవ్రత దృష్ట్యా పాలకుర్తి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI దూలం పవన్ కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, సమస్యలు ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలని కోరారు.