KMM: ఖమ్మం నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ పేర్కొన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాపర్తి నగర్ వద్ద బైపాస్ రోడ్ జలమయం అయింది. జలమయమైన ప్రాంతాన్ని బుధవారం సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం సందర్శించి నిరసన తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్, మేయర్ స్పందించాలని డిమాండ్ చేశారు.