MDK: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన గంగుల కృష్ణారెడ్డి, అనసూయ అనే దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఇంటి పైకప్పు నుంచి లోనికి చొరబడ్డారు. ఇంట్లో బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, 65 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.