W.G: నరసాపురం పట్టణంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలివానల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. మొంథా తుఫాను ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇళ్ల పైకప్పులు దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించి తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.