ATP: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో స్థాపించబడిన అనంతపురం పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను బుధవారం సంబంధిత అధికారులు, ఉద్యోగ సిబ్బంది జేసీబీతో తొలగించారు. త్వరలోనే పారిశ్రామిక వాడలో అహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు మొక్కలు నాటడం, సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నగేష్ కుమార్ తెలిపారు.