MHBD: కొత్తగూడ మండల ప్రజలకు గ్రామపంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ రాజు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో వర్షాల కారణంగా ఎవరు బయటకు వెళ్ళకుండా చూడాలన్నారు. వ్యవసాయ పనులకు, చేపలు పట్టుటకు, పశువులను మేతకు ఎవరూ వెళ్లరాదని, పాత ఇళ్లలో, కూలిపోయే ఇళ్లు ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాలాన్నారు.