TG: మొంథా తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఖాజాగూడ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని GHMC అధికారులు సూచించారు.