MDK: రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.