VKB: భారీ వర్షాల కారణంగా తరగతి గదిలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థులు వర్షంలో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటనలు పదేపదే జరుగుతున్నాయని, ఉదయం స్కూళ్లకు రాకముందే సెలవు ప్రకటిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.