CTR: ‘మొంథా’ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సూచించారు. ఈ మేరకు ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గం అధికార యంత్రాంగం జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలియజేశారు. కాగా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.