KDP: రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప ప్రెస్ క్లబ్బులో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నానాటికి కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు.