CTR: పుంగనూరులోని MRC ఆవరణంలో ఆదివారం సాయంత్రం STU డివిజన్ సమావేశం జరిగింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం మేరకు, పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.