NLG: చిట్యాల మండలంలో 5 మద్యం దుకాణాలకు గాను 192 దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్ కేంద్రంలోని 4 షాపులతో పాటు, వెలిమినేడుకు చెందిన ఒక షాపుకు కలిపి మొత్తం 192 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము ద్వారా ప్రభుత్వానికి 5.76 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే ఇది 1.14 కోట్లు అధికం. గతంలో కంటే 41 దరఖాస్తులు తక్కువగా వచ్చినప్పటికీ ఆదాయం మాత్రం పెరిగింది.