AKP: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మునగపాక మండలంలోని ప్రతి గ్రామాల్లో జరగాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మూగపాక పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా జరిగే నష్టాలను ప్రజలకు వివరించి, సంతకాలు సేకరించాలని కోరారు.