MDK: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 498 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ మండలం రాజ్ పల్లి సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతులు కోతలు పూర్తిచేసే ఆరబెట్టుతున్నారని, ఆరబెట్టిన ధాన్యానికి టోకెన్లు జారీ చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం సరఫరాకు వాహనాలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.