KNR: మహిళా, శిశు, దివ్యాంగుల శాఖ, భారత ప్రభుత్వ అలిమ్కో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న మానకొండూరు ఎంపీడీవో కార్యాలయంలో, 29న హుజూరాబాద్ ఐసీడీఎస్ కార్యాలయం, అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు జరుగుతాయి. దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.