BDK: ఇల్లందు మండలంలో విస్తృతంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ముక్కిన రంగు మారిన మొక్కజొన్నలను ప్రభుత్వమే మద్దతు ధర రూ. 2400 కొనుగోలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు చంద్రా అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు మండలంలోని మర్రిగూడెం, పోలవరం, కొమరారంలో వారు పర్యటించారు.