MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని సంస్థానాధీశులు రాజా శ్రీరామ్ భూపాల్ బంగ్లాలో కురుమూర్తి స్వామి ఆభరణాలకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నంబి వంశస్థులు ఆభరణాలను పాదయాత్రగా కురుమూర్తి గుట్టకు చేర్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారుల సమక్షంలో ఆభరణాలను పూజారులకు అందజేశారు.