CTR: ఐరల ఎగువ తవణంపల్లి మండలం అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైక్పై ఇంటికి వస్తుండగా, ఐరాల మండలం చిగరపల్లి వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.