NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఆదివారం అతిగా మద్యం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సమీర్ అనే వ్యక్తిని పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వరద కెనాల్లో సమీర్ ఆత్మహత్యకు ప్రయత్నించగా, సమీపంలో ఉన్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని రక్షించారు. 108 అందుబాటులో లేకపోవడంతో పోలీసులే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.