KDP: అట్లూరు మండలం ముత్తుకూరులో వాగులో కాలుజారి పడి వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతయిన వ్యక్తి బోడిశెట్టిపల్లికి చెందిన ప్రభాకర్(50)గా స్థానికులు గుర్తించారు. గ్రామంలో వృద్ధ మహిళ చనిపోవడంతో అంతిమయాత్రకు డప్పు వాయించేందుకు వచ్చాడు. కార్యక్రమం అనంతరం కాళ్లు కడుక్కునేందుకు వాగులో దిగగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.