NZB: సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం రెండో రోజు తెలంగాణ జాగృతి ‘జనంబాట’లో భాగంగా ఆమె మోపాల్ మండలం భైరాపూర్లో పర్యటించారు. గ్రామ పరిధిలో మోతీరాం తండాకు చెందిన పోడు బాధిత రైతు ప్రకాశ్ కుటుంబాన్ని పరామర్శించి పంట పొలాన్ని పరిశీలించారు.