ప్రకాశం జిల్లాలో ముంధా తుఫాన్ కారణంగా ఈనెల 27, 28,29 తేదీల్లో మూడు రోజులపాటు అన్ని పాఠశాలలకు కలెక్టర్ రాజాబాబు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం వెల్లడించారు. విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలు వాగులు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.