VSP: విశాఖలోని మాధవధార అంబేద్కర్ కాలనీలో వాంబే గృహాల గోడ బీటలు వారగా.. దాని పరిస్థితిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న కలెక్టర్ అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. తక్షణం పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.