ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని బాలరాజు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రాంతీయ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చించారు. రెండు నియోజకవర్గాల మధ్య పరస్పర సహకారం కొనసాగించాలన్నారు.