విశాఖ వేదికగా జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 168 పరుగుల చేయగా, ఇంగ్లండ్ బ్యాటర్లు అమీ జోన్స్ (86 నాటౌట్), టామీ బ్యూమాంట్ (40) రాణించడంతో కేవలం 29.2 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో NZ 6వ స్థానంలో నిలిచి WC నుంచి నిష్క్రమించిగా, ENG రెండవ స్థానంతో గ్రూప్ దశను ముగించింది.