ప్రకాశం: బెస్తవారిపేట లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తుఫాన్ నేపథ్యంలో అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు..తుఫాన్ సమయంలో అవసరమైన సహాయక చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రంగనాయకులు, తహసీల్దార్ జితేంద్ర, ఎస్సై రవీంద్ర రెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.