MNCL: భీమారంలోని శ్రీ కోదండ రామాలయం ఆలయ అభివృద్ధికి మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ భుక్య రాజ్‌కుమార్ నాయక్ రూ.లక్ష 11,116 విరాళం ఇచ్చారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్ర.మంలో ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.30 వేలు, ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన ఇటుక కోసం రూ.81,116 చొప్పున చెక్కును అందజేశారు.