GNTR: తెనాలి-విజయవాడ రైలు మార్గంలో చిలువూరు రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. సుమారు 55-60 ఏళ్ల వయస్సు గల వృద్ధుడు రైలు ఢీకొని మృతిచెందినట్లు సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ ఎస్సై వెంకటాద్రి విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.