కృష్ణా: ‘మొంథా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ను ఆదివారం పరిశీలించారు. బీచ్‌కు తాత్కాలికంగా మూసివేయడంతో పాటు, తాజా పరిస్థితులను తెలుసుకున్న కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.