NLR: మాజీ సీఎం జగన్‌కి మానసిక స్థితి బాగోలేదని విమర్శలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. ‘సోమిరెడ్డి నీ ఆరోగ్యం ఎలా ఉందో చూపించుకో’ అన్నారు. జగన్ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. జగన్ మానసిక స్థితి గరించి మాట్లాడే అర్హత సోమిరెడ్డికి లేదన్నారు.