తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.