NGKL: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం అచ్చంపేట పట్టణంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బండారు దత్తాత్రేయ క్షేత్రస్థాయిలో నాలుగు దశబ్దాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.