NZB: చందూర్ మండల కేంద్రంలో మధ్యాహ్నం ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండ ఉన్నా, వాతావరణం మారి వర్షం పడింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రోడ్లపై ఆరబోసుకున్న రైతులకు నష్టం జరిగింది. కొంతమంది రైతుల ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది. కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.