ప్రకాశం: తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో వచ్చే 3, 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వై.పాలెం ఎస్సై చౌడయ్య తెలిపారు. తుఫాన్ ప్రభావ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున గ్రామాల్లోని చెరువుల వద్ద సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ సిబ్బంది, బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.