KMM: పెనుబల్లి మండలంలోని లంకసాగర్ పీహెచ్సీ పరిధిలో రామన్నపాలెంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ కనకరత్నం అనారోగ్యంతో ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పీహెచ్సీ వైద్యాధికారి కిరణ్ కుమార్తో పాటు సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆరోగ్య పర్యవేక్షకులు నాగేశ్వరరావు, ఇతర ఆశా వర్కర్లు, సిబ్బంది సంతాపం తెలిపారు.