TPT: రాష్ట్ర పౌరసరఫలాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద ఆయనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు తెలియజేశారు.